నిజామాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్బొమ్మ మహేష్గౌడ్మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవిరావడానికి సహకరించినందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పా ర్టీని మరింత బలోపేతం చేయడంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారని మహేశ్‌గౌడ్ తెలిపారు.
సుదర్శన్ రెడ్డిని కలిసివారిలో స్టేట్కోఆపరేటివ్ యూనియన్ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడుగు గంగాధర్, ప్రచార కమిటీ సభ్యుడు బి.శ్రీనివాస్, ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.