- పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీ నేతల్లో సంతోషం కనిపించడం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివాస్’ గా కేంద్రం ప్రకటించడాన్ని చూస్తుంటే.. కాంగ్రెస్ ను చూసి బీజేపీ ఎలా భయపడుతుం దో అర్థం అవుతోందన్నారు. శనివా రం గాంధీ భవన్ లో నిరంజన్ మీడి యాతో మాట్లాడారు. ప్రధానిగా మోదీ ఎన్నికయినా.. గెలుపు కాంగ్రెస్‌ది అన్నట్టుగా దేశ ప్రజలు అభిప్రాయ పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు కాంగ్రెస్‌పై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.