
కాలువగట్టుపై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నీళ్లలో పడిపోవడంతో నలుగురు చనిపోయిన సంఘటన అనంతపురంలో జిల్లాలో జరిగింది. కాలువగట్డు మీద నుంచి… ట్రాక్టర్ అతివేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
NP కుంట పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ దగ్గర ఈ ఘటన జరిగింది. వేగంగా వెలుతున్న ట్రాక్టర్ ఒక్క సారిగా అదుపు తప్పింది. పల్టీలు కొడుతూ కాలువలోకి బోల్తాపడింది. ట్రాక్టర్ ట్రాలీలో కూర్చుని ఉన్న వారిలో నలుగురు.. నీళ్లలో మునిగి.. ఊపిరిఆడక చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లంతా కూలీలేనని గ్రామస్తులు చెప్పారు.
స్థానికులు వెంటనే.. కాలువలోకి దిగి.. ట్రాలీని తిప్పి.. అందులోని వారిని బయటకు తీసి హాస్పిటల్ కు పంపించారు.