- సీఎం బందోబస్తుకు వెళ్తుండగా ఘటన
 
అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ పర్యటన సందర్భంగా బందోబస్తుకు వెళ్తున్న గద్వాల డీఎస్పీ కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. గద్వాల నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి వస్తుండగా, గద్వాల డీఎస్పీ నరేందర్ రావు ప్రయాణిస్తున్న ఇన్నోవాను మండలంలోని అయినోలు గ్రామ శివారులో దుబ్బతండా నుంచి మహిళా కూలీలను తీసుకువస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ ఢీకొనడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో డీఎస్పీతో పాటు డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ట్రాక్టర్లో ఉన్న ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
