జూబ్లీహిల్స్​లో వారం రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు :​ రంగనాథ్

జూబ్లీహిల్స్​లో వారం రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు :​ రంగనాథ్

ఖైరతాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్ ఏరియాలో శుక్రవారం నుంచి ట్రాఫిక్​ను దారి మళ్లించనున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామని.. ఆ  తర్వాత ఇబ్బంది ఉంటే కొన్ని మార్పులు చేస్తామని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్​లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నం.45, జర్నలిస్టు కాలనీ రూట్​లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు  వెహికల్ డైవర్షన్ చేపట్టినట్లు తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ రోడ్ నం.45 వైపునకు ఈజీగా చేరుకునేందుకు ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్​ను ఆయన వివరించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

వెహికల్స్ దారి మళ్లింపు ఇలా..

  • బంజారాహిల్స్ రోడ్ నం. 12(పెన్షన్ ఆఫీసు)  నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్టు  రోడ్ నం.45 మీదుగా వెళ్లేందుకు అనుమతించరు. జగన్నాథ టెంపుల్ సర్కిల్ వద్ద కుడివైపునకు తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్కు , ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్ మీదుగా చెక్ పోస్టుకు వెళ్లాల్సి ఉంటుంది. 
  • జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వెహికల్స్​ను రోడ్ నం,45, జర్నలిస్టు కాలనీ నుంచి కుడి వైపునకు  అనుమతించరు.  రోడ్ నం.36 మీదుగా మెట్రో పిల్లర్ నం. 1650, రోడం నం. 54 నుంచి వెళ్లాలి.
  • కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఇనార్బిట్ మాల్ వైపు మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నం,45 వైపు అనుమతించరు.  రోడ్ నం. 54 వద్ద ఎడమ వైపునకు వెళ్లి రోడ్ నెం. 36 ఫ్రీడమ్ పార్క్ నుంచి మెట్రో పిల్లర్ నం. 1663 వద్ద యూటర్న్ తీసుకొని చెక్ పోస్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి నుంచి బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ, ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లేవారు రోడ్ నం.45లోని హార్ట్ కప్ కేఫ్ వద్ద యూ టర్న్ తీసుకోవాలి. గీతా ఆర్ట్స్ ఆఫీసు నుచి రోడ్ నం.51, పక్షి సర్కిల్, న్యాయవిహార్‌‌‌‌ నుంచి ఎడమ వైపునకు వెళ్లి ఫిల్మ్ నగర్ జంక్షన్​కు వెళ్లాల్సి ఉంటుంది. 
  • ఫిల్మ్ నగర్ నుంచి చెక్ పోస్టుకు వెళ్లే వెహికల్స్ రోడ్ నం.45 వద్ద ఎడమ వైపునకు తిరిగి హార్ట్ కప్ కేఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని చెక్ పోస్టుకు రావాల్సి ఉంటుంది. 
  • బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వచ్చే వెహికల్స్​ను రోడ్ నం.45 మీదుగా అనుమతించరు. ఈ వెహికల్స్ ఫిల్మ్ నగర్ రోడ్ ఎడమవైపునకు వెళ్లి  భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్  తీసుకొని ఫిల్మ్ నగర్  జంక్షన్ వద్ద ఎడమవైపు నుంచి జర్నలిస్ట్ కాలనీ/రోడ్ నం. 45 జంక్షన్​కు చేరుకోవాల్సి ఉంటుంది. 
  • ఫిల్మ్ నగర్ నుంచి ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నం.12 వైపు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుని  ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.