చింతకాని మండలంలో..ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

చింతకాని మండలంలో..ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఘటన

చింతకాని, వెలుగు :  ఈత కొట్టేందుకు వెళ్లిన అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన్నమండల గ్రామానికి చెందిన కాశిమళ్ల వెంకటి, సుభద్ర దంపతులకు ముగ్గురు కొడుకులు. ఇందులో నాగగోపి (22), నంద కిశోర్‌‌ (18) వారి ఫ్రెండ్‌‌ పట్టా బుజ్జితో కలిసి శుక్రవారం బైక్‌‌ను క్లీన్‌‌ చేసేందుకు మున్నేరు వాగు వద్దకు వెళ్లారు. 

బైక్‌‌ను క్లీన్‌‌ చేసిన అనంతరం ఈత కొట్టేందుకు ముగ్గురూ కలిసి వాగులోకి దిగారు. వాగు లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడే చేపలు పడుతున్న ఓ వ్యక్తి బుజ్జిని కాపాడారు. నాగగోపి, నంద కిశోర్‌‌ మాత్రం నీటిలో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని వాగులో నుంచి ఇద్దరి డెడ్‌‌బాడీలను బయటకు తీశారు.