
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూ ల్జిల్లాతాడూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన భరత్(30) కరెంట్షాక్తో చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నా యి. భరత్ గురువారం తన పొలం వద్దకు వెళ్లి కింద పడిపోయిన బోర్ కరెంట్ వైర్లను సరి చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.