నల్గొండ జిల్లాలో విషాదం.. హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన ఎంత ఘోరం జరిగిందంటే..

నల్గొండ జిల్లాలో విషాదం.. హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన ఎంత ఘోరం జరిగిందంటే..

నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో NH65పై నూతనంగా నిర్మించిన డోన్కిట్ ఫిల్టర్ కాఫీ కేఫ్ పై కప్పు కూలి ఇద్దరు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కేఫ్ ఈ రోజు (ఆదివారం) నూతనంగా ప్రారంభం కావాల్సి ఉంది. రేకుల పై వాటర్ ట్యాంక్ నిర్మించి దానిలో నైట్ ట్యాంక్లో వాటర్ పట్టి హోటల్ యజమని కుటుంబ సభ్యులు హోటల్ లోపల నిద్ర పోయారు. నీళ్ల బరువుకు పైకప్పు నిద్రిస్తున్న వారిపై కూలింది. కామినేని హాస్పిటల్కి క్షతగాత్రులను తరలించారు. చికిత్స పొందుతూ హోటల్ యజమాని భార్య, కొడుకు మృతి చెందారు.

కూతురు, అమ్మ, యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పి. నాగమణి (32), పి. వంశీ కృష్ణ (6)గా పోలీసులు గుర్తించారు. మృతులు మాడుగులపల్లికి చెందిన నాగమణి వంశీకృష్ణ తల్లి కొడుకులుగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోటల్ యాజమాని తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. FTL ల్యాండ్లో అనుమతులు లేకుండా హడావుడిగా రాత్రి సమయంలోఅక్రమంగా నిర్మించడం వలనే  ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.