
ఒక ఆవు ఇరవై ఏళ్లుగా శివుని సేవలో తరించి.. నిత్యం ఆలయాన్ని అంటి పెట్టుకుని ఆదాయాన్ని సమకూర్చిన గోమాత మృతి ఆ గ్రామ ప్రజలను శోక సంద్రంలో మునిగేలా చేసింది. కుటుంబ సభ్యుడు చనిపోయినట్లుగా భావించిన గ్రామస్తులు.. ప్రత్యేక పూజలతో అంత్యక్రియలు చేసి ఆవుతో తమకు ఉన్న రుణం తీర్చుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు కన్నుమూసింది. దీంతో గురువారం (జులై 10) ప్రత్యేక పూజాలతో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు భక్తులు, గ్రామస్తులు. ఆవు గొప్పదనం గురించి, ఆవుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు గ్రామస్తులు.
20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించారు. ఇప్పటి వరకు 16 దూడలకు జన్మనిచ్చింది ఆ గోమాత. గత ఇరవై ఏళ్లుగా ఆలయంలో ధూప, దీప, నైవేద్యలకై ఆవు ఆదాయాన్ని సమకూర్చినట్లు ఆలయ పూజారి తెలిపారు. అలాంటి ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ALSO READ : 32 ఎకరాల ల్యాండ్ కొన్న.. టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి.. అయితే గొడవేంటంటే..
తమ బంధువు, తమ కుటుంబ సభ్యుడు తమకు దూరమైనంత ఆవేదనతో ఆవుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. అంతా కలిసి డప్పు వాయిద్యాలతో ఆవు అంత్యక్రియలను ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం విశేషం.