అప్పుల పాలైన గవర్నమెంట్ స్కూల్ టీచర్.. మేడ్చల్లోని లాడ్జిలో ప్రాణం తీసుకున్నడు !

అప్పుల పాలైన గవర్నమెంట్ స్కూల్ టీచర్.. మేడ్చల్లోని లాడ్జిలో ప్రాణం తీసుకున్నడు !

మెదక్: మేడ్చల్లోని లాడ్జిలో మెదక్ జిల్లాకు చెందిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉరేసుకుని చనిపోయన ఘటన కలకలం రేపింది. మెదక్ పట్టణానికి చెందిన గవర్నమెంట్ టీచర్ కాముని రమేష్ శనివారం మేడ్చల్లోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన చావుకు ఫ్రెండ్స్ వేధింపులు కారణమని రమేష్ చెప్పాడు. ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండలం సర్ధన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న రమేష్ గతంలో తెలిసిన వారి దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అప్పులు, వడ్డీలు భారమై చెల్లించలేక రమేష్ ఏడాది కిందట చేతులెత్తేశాడు.

Also Read:-డబ్బు విషయంలో తేడాలు.. భార్యతో అఫైర్ ఉందనే డౌట్.. మలక్‌పేట కాల్పుల కేసులో వీడిన మిస్టరీ

అప్పులిచ్చిన వారి ఒత్తిడితో మెదక్లో ఉన్న సొంత బిల్డింగ్, ప్లాట్లు అమ్మి అప్పులు చెల్లించాడు. తీసుకున్న అప్పులు చెల్లించినప్పటికీ కొందరు ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని, కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారని, భార్య, పిల్లలను రోడ్డుకు ఈడ్చారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని సెల్ఫీ వీడియోలో ముఖ్యమంత్రి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్కు రమేష్ విజ్ఞప్తి చేశాడు.