రెవెన్యూ ఉద్యోగిని సూసైడ్

రెవెన్యూ ఉద్యోగిని సూసైడ్

పాన్​గల్, వెలుగు: మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు భార్య నీలిమ ఆత్మహత్య చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్​పేట తహసీల్దార్​ ఆఫీస్​లో సీనియర్​ అసిస్టెంట్​గా పని చేసే నీలిమ వనపర్తిలో అద్దెకు ఉంటున్న ఇంట్లో మంగళవారం రాత్రి ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బుసిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని నీలిమకు నివాళులు అర్పించి, మాజీ ఎంపీపీని పరామర్శించారు. పగిడాల శ్రీనివాస్, గోవర్ధన్  సాగర్  ఉన్నారు.

భార్యకు వీడియో కాల్  చేస్తూ మరొకరు..

శాంతినగర్: భార్యకు వీడియో కాల్  చేసి పురుగుల మందు తాగి జితేందర్  నాయుడు(27) సూసైడ్  చేసుకున్నాడు. ఎస్సై నాగశేఖర్  రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడుకు చెందిన జితేందర్  నాయుడుకు కొన్ని రోజుల నుంచి ఛాతీలో నొప్పి వస్తోంది. హాస్పిటల్ లో చూపించినా నొప్పి తగ్గకపోవడంతో ఆ బాధను తట్టుకోలేక మంగళవారం వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామ శివారు నుంచి భార్యకు వీడియో కాల్  చేసి చనిపోతున్నానని చెప్పాడు. 

వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు శాంతినగర్ లో ప్రైవేట్  హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సీరియస్ గా ఉండడంతో కర్నూల్​కు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.