కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ ..ఇకపై 30 రోజుల రీచార్జ్

కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ ..ఇకపై 30 రోజుల రీచార్జ్
  •     డేటా లేకుండా కాల్స్​కు ప్రత్యేక ప్లాన్లు
  •     కస్టమర్లకు ట్రాయ్ గుడ్​న్యూస్


న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌‌‌‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు 28 రోజుల చొప్పున ఉండే రీఛార్జ్ సైకిల్‌‌‌‌ స్థానంలో ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. టెలికాం వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026 పేరుతో ఈ మార్పులను సెప్టెంబర్ 22న విడుదల చేసింది.

దీని ప్రకారం టెలికాం సంస్థలు వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్ ఆప్షన్లు అందించాల్సి ఉంటుంది. చాలా కాలంగా ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏడాదిలో 12 నెలలకు 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ అంశాన్ని రాఘవ్ చడ్ఢా మార్చి 11న పార్లమెంట్‌‌‌‌లో ప్రస్తావించారు. 12 నెలలు ఉన్న ఏడాదిలో 13 రీఛార్జ్‌‌‌‌లు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు అందించాలని కోరారు. ట్రాయ్​తాజా నిర్ణయంతో ఇకపై ఏడాదిలో 12 సార్లు మాత్రమే రీచార్జ్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఫోన్‌‌‌‌లో ఇంటర్నెట్  ఉపయోగించని వారికి డేటా లేకుండా వాయిస్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ నిర్ణయించింది.