ట్రెయినర్ ఎయిర్‌‌క్రాఫ్ట్ కూలడంతో ఇద్దరి మృతి

ట్రెయినర్ ఎయిర్‌‌క్రాఫ్ట్ కూలడంతో ఇద్దరి మృతి

ధెంకానల్: టూ సీటర్ ట్రెయినర్ ఎయిర్‌‌క్రాఫ్ట్‌ కూలిపోవడంతో ఓ ట్రెయినీ పైలట్‌తోపాటు ఆమె ఇన్‌స్ట్రక్టర్‌‌ చనిపోయిన ఘటన ఒడిషాలోని ధెంకానల్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది. రిపోర్ట్స్‌ ప్రకారం.. బిరసాల్‌లోని గవర్నమెంట్ ఏవియేషన్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (జీఏటీఐ)లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ‘బిరసాల్ ఎయిర్‌‌స్ట్రిప్‌లో ఇవ్వాళ జరిగిన ట్రెయినర్ ఎయిర్‌‌క్రాఫ్ట్ ప్రమాదంలో బిహార్‌‌కు చెందిన కెప్టెన్ సంజీవ్ కుమార్ ఝాతోపాటు అనీస్ ఫాతిమా అనే ట్రెయినీ పైలట్ (తమిళనాడు) చనిపోయారు’ అని న్యూస్ మీడియా ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

గాయపడిన ఇద్దరినీ దగ్గరలోని కామాఖ్యనగర్‌‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారని ధెంకానల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బీకే నాయక్ తెలిపారు. ట్రెయినీ పైలట్‌తోపాటు ఆమె ఇన్‌స్ట్రక్టర్ మృత దేహాలను పోస్ట్‌మార్టంకు పంపారు. ఎయిర్‌‌క్రాఫ్ట్‌ క్రాష్‌కు కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. టెక్నికల్ రీజన్స్ లేదా ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.