27 ఏళ్లలో 52 సార్లు బదిలీ 

27 ఏళ్లలో 52 సార్లు బదిలీ 

ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు మామూలే… కానీ ఓ IAS అధికారి సర్వీసులో చేరిన 27 ఏళ్లలో దాదాపు 52 సార్లు బదిలీ అయ్యారంటే ఆయన ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో తెలుస్తోంది. నిజాయితీగా పనిచేసే వారికి బదిలీలు తప్పవు అనటాన్ని ఈ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారే  నిదర్శనం. ఆయనే అశోక్‌ ఖేమ్కా. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌ కతా కు చెందిన అశోక్‌ 1991లో హరియానా కేడర్‌ నుంచి IASకు ఎంపికయ్యారు. విధుల్లో చేరిన దగ్గర నుంచి నిజాయితీగా పనిచేస్తూ అనేక కుంభకోణాలను బయటపెట్టారు. దీంతో బదిలీలు  పరంపర కొనసాగుతూనే ఉంది. 15 నెలల కిందట హర్యానా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అశోక్‌ను తాజాగా… సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. తన 27 ఏళ్ల కెరీర్‌లో ఇది 52వ బదిలీ అని తెలిపారు. అశోక్‌తో పాటు మరో 8 మంది IAS అధికారులను హర్యానా ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది.