యూట్యూబ్‌‌ కామెంట్స్‌‌కి ట్రాన్స్‌‌లేషన్‌‌

V6 Velugu Posted on Sep 20, 2021

యూట్యూబ్‌‌ వచ్చాక ఆ భాష, ఈ భాష అని లేకుండా అన్ని భాషల వీడియోలు చూస్తున్నారు నెటిజన్స్‌‌. అలా చూసేవాళ్లలో చాలామందికి వీడియోలు చూడటంతో పాటు టైంపాస్‌‌కి కామెంట్లు చదివే అలవాటు కూడా ఉంటుంది. వేరే భాషల్లో వీడియోలు చూస్తున్నప్పుడు కామెంట్లు అర్థం కావు. ఇప్పుడు ఆ సమస్య ఉండదట. ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ట్రాన్స్‌‌లేట్‌‌ ఆప్షన్‌‌ ఉన్నట్లుగానే యూట్యూబ్‌‌లో కూడా రాబోతుంది. ఆండ్రాయిడ్‌‌, ఐఓఎస్‌‌ మొబైల్స్‌‌లో యూట్యూబ్‌‌ వాడేవారు దీన్ని వాడొచ్చు. సుమారు వంద భాషల్లో ట్రాన్స్‌‌లేట్‌‌ చేసుకునే అవకాశం ఉంటుందని యూట్యూబ్‌‌ ప్రకటించింది. ఏ భాషలో కామెంట్‌‌ చదవాలనుకుంటే దానిపైన క్లిక్‌‌ చేస్తే సరిపోతుంది. లైక్‌‌, డిస్‌‌లైక్‌‌ బటన్ల పక్కనే ట్రాన్స్‌‌లేట్‌‌ బటన్‌‌ కూడా ఉంటుంది.

Tagged COMMENTS, YouTube, , Translation

Latest Videos

Subscribe Now

More News