
ఛప్రా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ట్రెండ్స్ రాజకీయ పండితులను తప్పుగా నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ తర్వాత బిహార్‌లో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని మోడీ చెప్పారు. ‘తొలి దశ పోలింగ్ అనంతరం వచ్చిన ట్రెండ్స్‌తో ఎన్డీఏ మళ్లీ పవర్‌లోకి వస్తుందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్డీఏను ఇష్టపడటం కొందరికి నచ్చడం లేదు. వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్‌లో ఎన్డీఏ గెలుస్తుందన్న సమాచారంతో కొందరు నేతలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందుకే వారు నన్ను తిడుతున్నారు. వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. బిహారీలపై మీ కోపాన్ని ప్రదర్శించొద్దు’ అని బిహార్‌లోని ఛప్రా బీజేపీ ఎన్నికల క్యాంపెయినింగ్‌లో మోడీ పేర్కొన్నారు.