కాగజ్‌‌‌‌నగర్ పట్టణంలో..ట్రెండ్స్ షోరూం షురూ

కాగజ్‌‌‌‌నగర్ పట్టణంలో..ట్రెండ్స్ షోరూం షురూ

హైదరాబాద్​, వెలుగు :  దుస్తులు, యాక్సెసరీస్ అమ్మే రిలయన్స్​కు చెందిన ఫ్యాషన్​ రిటైలర్​‘ట్రెండ్స్’  ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్ పట్టణంలో కొత్త స్టోర్​ను ప్రారంభించింది. చిన్న నగరాలకు విస్తరించడంలో భాగంగా ఇక్కడ దుకాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. మెట్రోలు, మినీ మెట్రోల నుంచి టైర్ 1, 2 పట్టణాలు సహా అంతటా టెండ్స్​ ఎంతోమందికి ఇష్టమైన ఫ్యాషన్ షాపింగ్ గమ్యస్థానంగా ఎదిగిందని కంపెనీ తెలిపింది.

కాగజ్​నగర్​పట్టణవాసులకు ట్రెండీ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ,  ఫ్యాషన్ యాక్సరీస్ ఇక్కడ అందుబాటులో ధరల్లో లభిస్తాయని ట్రెండ్స్​తెలిపింది. ఈ స్టోర్​ను 8,471 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కస్టమర్లకు పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది.