బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన జగ్మల్ తండావాసులు

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన జగ్మల్ తండావాసులు

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండలం లోక్యాతండా జేపీ జగ్మల్ తండాకు చెందిన గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తండాల్లోని సుమారు 50 కుటుంబాలకు పైగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్​లో  పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్త్యా సెట్రామ్ నాయక్, జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య, వార్డు మెంబర్ జర్పుల వెంకన్న, లింబ్యా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

అలాగే లోక్య తండా నుంచి 10, జుజ్జల్​రావుపేటలో 20 కుటుంబాలు కాంగ్రెస్​కండువా కుప్పుకున్నాయి. కూసుమంచి మండల కేంద్ర సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి బస్మాగి మధు కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించి  ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.