రేషన్ స్కామ్ కేసు.. టీఎంసీ నేతను అరెస్ట్ చేసిన ఈడీ

  రేషన్ స్కామ్ కేసు..  టీఎంసీ నేతను అరెస్ట్ చేసిన ఈడీ

రేషన్ స్కామ్ కేసుకు సంబంధించి బొంగావ్ మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్, టీఎంసీ నేత  శంకర్ ఆదిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసింది.  సమాచారం మేరకు ఈడీ బృందం అర్ధరాత్రి చర్యలు చేపట్టింది. గత సాయంత్రం, శంకర్ ఆది అత్తమామల దాచిన స్థలం నుండి 8.5 లక్షల రూపాయలను ఈడీ రికవరీ చేసింది. అల్మారా నిండా నగదు కనిపించింది.వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. 

బెంగాల్‌‌‌‌‌‌‌‌లో ఈడీ ఆఫీసర్లపై దాడి

బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని సందేశ్‌‌‌‌‌‌‌‌ఖాలీలో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై టీఎంసీ నేత షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. రేషన్ స్కామ్‌‌‌‌‌‌‌‌ కేసులో  ఇటీవల మంత్రి జ్యోతిప్రియ మలిక్  అరెస్టయ్యారు. దాంతో  కేసుతో సంబంధమున్నట్లు భావిస్తోన్న 18 చోట్ల ఈడీ ఆఫీసర్స్ శుక్రవారం రెయిడ్స్ చేపట్టారు.

 సీఆర్పీఎఫ్​ బలగాలతో షాజహాన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులను  ఆయన అనుచరులు అడ్డుకున్నారు. వెంటనే  వెనక్కి వెళ్లిపోవాలంటూ దాడి చేశారు. దాదాపు 800 మంది టీఎంసీ మద్దతుదారులు ఆయుధాలతో దాడి చేయడంతో ఈడీ అధికారులు, కేంద్ర బలగాల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాణభయంతో  పరుగులు పెట్టారు.