కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ దూకుడు

కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ దూకుడు

కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 144 సీట్లకు జరిగిన ఎన్నికలో టీఎంసీ ఇప్పటి వరకు 17 స్థానాలు ఖాతాలో వేసుకుంది. మరో 117 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 4, లెఫ్ట్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 2015 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 114 సీట్లు సొంతం చేసుకోగా.. ఈ సారి పరిస్థితి గమనిస్తే గతంలో కన్నా ఎక్కువ స్థానాల గెలుచుకునే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయగా.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీకి దిగాయి. ఇక తృణమూల్ అభ్యర్థి మమతా బెనర్జీ మేనకోడలు కజారి బెనర్జీ 73వ వార్డు నుంచి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి.

For more news

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో