
ఆదిలాబాద్, వెలుగు: దారి దోపిడీ కేసులో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, రిమాండ్కుపంపినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వికాస్ మోజే ఓ వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నారు.
ఈ నెల7న ఇచ్చోడ పట్టణానికి వెళ్లి అక్కడ డబ్బులు తీసుకొని అదిలాబాద్‌కు వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ శివారులోని దేవాపూర్ చెక్ పోస్ట్ దాటిన తరువాత అటకాయించి దాడి చేశారు. రూ.4.15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బాధితుడు పారిపోతున్న నిందితుల వాహనాన్ని వెంబడించి వారి ముఖాలు కనిపించేలా వీడియో తీసి పోలీసులకు అప్పగించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు జాదవ్ అంకుశ్, ముండే సచ్చిదానంద్, కేంద్రే శంకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రాణాలకు తెగించి నిందితులను వెంబడించి వారి ముఖాలు కనిపించేలా వీడియో తీసిన బాధితుడిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. అతడిని డీఎస్పీ జీవన్ రెడ్డి, మావల సీఐ స్వామి సన్మానించారు.