
హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మూవీలో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్గా అనుకొన్నారు.
అయితే, ఆమెకు స్టోరీ చెప్పగా అనేక కండీషన్స్ తో హర్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి. దీనికి తోడు రూ.20కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ డబ్బింగ్ విషయంలో కూడా మరిన్ని కండీషన్స్ పెట్టడంతో.. ఆ తర్వాత ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ' త్రిప్తి డిమ్రి అని అఫీషియల్ ప్రకటించాడు. దీంతో త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ గా మారింది.
The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025
ఇక స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి అవకాశం ఇవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవ్. దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె రూ.20 కోట్ట పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి త్రిప్తికి గాను ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
త్రిప్తి గత సినిమాలతో పోలిస్తే స్పిరిట్లో రెమ్యునరేషన్ చాలా ఎక్కువని తెలుస్తోంది. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే తీసుకునే త్రిప్తి.. ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్‌కు తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుందని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
►ALSO READ | AnasuyaBharadwaj: శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు వైరల్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సందీప్ తెరకెక్కించిన యానిమల్ ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిరోజులు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ ఉండసాగేది. అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి హవా కూడా కొనసాగుతుంది.
ఈ బ్యూటీ యానిమల్లో కనిపించింది చిన్న పాత్రలో అయిన..తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో,రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాంతో త్రిప్తికి పాలోయింగ్ విపరీతంగా పెరగడంలో నేషనల్ క్రష్ గానూ గుర్తింపు సొంతం చేసుకుంది.
మరోవైపు ఎప్పుకటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ యూత్ కి స్పెషల్ ట్రీట్ ని అందిస్తోంది. ప్రస్తుతం దడక్-2 సినిమాతో పాటు దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమాలతో త్రిప్తి బిజీగా ఉంది.ఇకపోతే, స్పిరిట్ సినిమాని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.