
- సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ లో సోమవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి పర్యటించారు. టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టను సందర్శించారు. శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దులగుట్ట చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గుట్ట అభివృద్దికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి నివాసానికి వెళ్ళి మాట్లాడారు.
అనంతరం అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దోళ్ళ గంగారెడ్డి, కంచెట్టిగంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్‌లో టీ బ్రేక్
భిక్కనూరు : హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కామారెడ్డి జిల్లా సరిహద్దు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. హోటల్ యజమాని ఒంటరి రవీందర్‌రెడ్డి రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి తేనేటి విందును అందజేశారు. గవర్నర్ వెంట ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.