క్షమించడమే గొప్ప విషయం..వివాదానికి ముగింపు ఇచ్చిన త్రిష

క్షమించడమే గొప్ప విషయం..వివాదానికి ముగింపు ఇచ్చిన త్రిష

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) ఇటీవల హీరోయిన్ త్రిష (Trisha)పై  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీనీ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా అందరు డిమాండ్ చేశారు. 

ఇక మన్సూర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని త్రిషను క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై త్రిష స్పందించింది. 'సహజంగా మనుషులు తప్పు చేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళను క్షమించడమే గొప్ప విషయం  అంటూ'..తన ట్వీట్లో తెలిపింది. దీంతో నెటిజన్స్ అంత..మీ గొప్ప నిర్ణయానికి అభినందనలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ విషయంలో త్రిషకు సపోర్ట్గా..చిరంజీవి, లోకేష్ కనగరాజ్, నాగ చైతన్య, మాళవిక మోహనన్, నితిన్ నిలిచారు. మన్సూర్ చేసిన కామెంట్స్ దారుణమని తప్పుబట్టారు. 

ఇంతకీ ఏం జరిగింది అంటే? 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్..లియో సినిమాలో హీరోయిన్  త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది అని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..సీనీ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. ఇక చివరికి మన్సూర్ క్షమాపణలు చెప్పడం..త్రిష పాజిటివ్గా స్పందిస్తూ..ఈ వివాదానికి నేటితో ముగింపు పలికింది.