Trisha: త్రిష మనసు దోచుకున్న ఉపాసన.. వైరల్ అవుతున్న గిఫ్ట్ హ్యాంపర్.. అందులో ఏముందంటే?

Trisha: త్రిష మనసు దోచుకున్న ఉపాసన.. వైరల్ అవుతున్న గిఫ్ట్ హ్యాంపర్.. అందులో ఏముందంటే?

స్టార్ హీరోయిన్ త్రిషకు మెగా కోడలు ఉపాసన కొణిదెల స్పెషల్ సమ్మర్ గిఫ్ట్ పంపించారు. ఉపాసన నిర్వహిస్తున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ బ్రాండ్ తరఫున పంపిన ఈ గిఫ్ట్ హ్యాంపర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆవకాయ పచ్చడి, పొంగల్ మిక్స్, కేసరి మిక్స్, హోమ్‌మేడ్ వంటి సంప్రదాయ తెలుగు వంటకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి.

ఈ గిఫ్ట్ అందుకున్న త్రిష ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ‘‘వేసవి కాలం వచ్చేసిందన్న ఫీలింగ్ ఈ గిఫ్ట్ చూసిన తర్వాతే కలిగింది’’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా, మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. చిరు, చరణ్ లతో త్రిషకు ఉన్న బాండింగ్ వల్లే ఉపాసన ఈ స్పెషల్ గిఫ్ట్ పంపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతకుముందు వీరిద్దరి కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చింది. ఈ కారణంగానే అత్తమ్మ కిచెన్ వంటకాలు త్రిష వరకు చేరాయని అంటున్నారు. ఇకపోతే, త్రిష, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే హీరో సూర్యతో 'కరుప్పు'లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో 'రామ్' అనే మూవీ చేస్తోంది. మరికొన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)