పెళ్లి కబురు చెప్పనున్న త్రిష? హింట్ కూడా ఇస్తోంది

పెళ్లి కబురు చెప్పనున్న త్రిష? హింట్ కూడా ఇస్తోంది

నలభై ఏళ్ల వయసులోనూ స్టార్​ హీరోయిన్​గా సందడి చేస్తోంది త్రిష(Trisha). ఇటీవల మణిరత్నం(Manirathnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్​ సెల్వన్(Ponniyin selvan)​లో యువరాణి కుందవైగా నటించి అలరించింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి వార్త మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే ఆ బంధంలోకి వెళ్లాలని డిసైడ్​ అయినట్టు ఈబ్యూటీ గతంలో పేర్కొంది.

ఇటీవల తన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడిషనల్​ ఫొటోలు షేర్​ చేస్తోంది. దీంతో త్రిష పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్​(Vijay)తో ఈ బ్యూటీ లియో(Leo)లో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత పెళ్లిపై క్లారిటీ ఇస్తుందేమో అని ఆమె ఫ్యాన్స్​ వెయిట్​ చేస్తున్నారు. ఇక ఒక్క ఇన్​స్టాగ్రామ్​లోనే ఈ ముద్దుగుమ్మకు ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.