33 జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీళ్లే..

33 జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీళ్లే..
  • రాష్ట్రం వచ్చాక తొలిసారి నియమించిన పార్టీ చీఫ్​ కేసీఆర్
  •  33 జిల్లాల్లో 19 జిల్లాలకు ఎమ్మెల్యేలే ప్రెసిడెంట్లు
  •  ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జెడ్పీ చైర్​పర్సన్​లకు అవకాశం
  •  ముందస్తు రావొచ్చన్న ఊహాగానాల మధ్యే నియామకాలు 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రం వచ్చాక తొలిసారిగా టీఆర్​ఎస్​ పార్టీకి జిల్లా అధ్యక్షులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​ నియమించారు. మొత్తం 33 జిల్లాలకుగానూ 19 జిల్లాలకు ఎమ్మెల్యేలనే అధ్యక్షులుగా చేశారు. మూడు జిల్లాలకు ఎంపీలు, రెండింటికి ఎమ్మెల్సీలకు ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించారు. ఒక మాజీ ఎమ్మెల్యే, ముగ్గురు జెడ్పీ చైర్​పర్సన్లు, ఇద్దరు కార్పొరేషన్​ చైర్మన్లు, ఒక డీసీఎంఎస్​ మాజీ చైర్మన్​, ఒక మున్సిపల్​ చైర్​పర్సన్​, ఒక మాజీ ఎంపీపీకి అవకాశం ఇచ్చారు. ఈమేరకు బుధవారం పార్టీ చీఫ్​ కేసీఆర్​ ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్న కోరుకంటి చందర్, కాంగ్రెస్​లో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్​ఎస్​లో చేరిన రేగా కాంతారావుకూ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు.అయితే, ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే జిల్లా అధ్యక్షులుగా నియమించడంతో వాటిపై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశే మిగిలింది. 

గ్రూపులకు అవకాశమివ్వొద్దనే

ఆరు నుంచి 9 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చన్న ఊహాగానాల మధ్యే టీఆర్​ఎస్​కు జిల్లాల అధ్యక్షులను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పదవుల కోసం పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్న వారితో పాటు తెలంగాణ వచ్చాక పార్టీలో చేరిన ఎంతో మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ చీఫ్​ కేసీఆర్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు కూడా. అయితే, కొన్ని జిల్లాల్లో సీనియర్​ నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించొద్దని ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఎన్నికలకు ముందు పార్టీలో గ్రూపులకు అవకాశం ఇవ్వొద్దన్న ఉద్దేశంతోనే ఎక్కువగా ఎమ్మెల్యేలకే పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశమిచ్చారనే చర్చ నడుస్తోంది. పార్టీ పరంగా ఇబ్బందులు లేనిచోటే మిగతా వారికి అధ్యక్షులుగా అవకాశమిచ్చారని చెప్తున్నారు. వారిలో ఒకరిద్దరు తప్ప నియామకాలకు మిగతా ఎవరూ ఎదురు చెప్పలేదని తెలుస్తోంది. అయితే అవకాశం దక్కని నేతలు.. కనీసం స్టేట్​ కమిటీలోనైనా పదవులు దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఎమ్మెల్యేలు అధ్యక్షులైన జిల్లాలు

జిల్లా    ఎమ్మెల్యే

  • ఆదిలాబాద్​                         జోగు రామన్న
  • కుమ్రం భీం ఆసిఫాబాద్​    కోనేరు కోనప్ప
  • మంచిర్యాల                       బాల్క సుమన్​
  • నిర్మల్                           ​    జి. విఠల్​ రెడ్డి
  • నిజామాబాద్​                     జీవన్​రెడ్డి
  • జగిత్యాల                           కె. విద్యాసాగర్​రావు
  • మెదక్​                                పద్మా దేవేందర్​రెడ్డి
  • వరంగల్​                           ఆరూరి రమేశ్​
  • హన్మకొండ                       దాస్యం వినయ్​భాస్కర్​
  • భద్రాద్రి కొత్తగూడెం        రేగా కాంతారావు
  • నల్గొండ                           రవీంద్ర కుమార్​ నాయక్​
  • రంగారెడ్డి                         మంచిరెడ్డి కిషన్​రెడ్డి
  • వికారాబాద్​                     మెతుకు ఆనంద్​
  • మహబూబ్​నగర్​              సి. లక్ష్మారెడ్డి
  • నాగర్​కర్నూల్​                 గువ్వల బాలరాజు
  • జోగులాంబ గద్వాల్​      కృష్ణమోహన్​ రెడ్డి
  • నారాయణపేట            ఎస్​. రాజేందర్​రెడ్డి
  • హైదరాబాద్​                మాగంటి గోపీనాథ్​
  • పెద్దపల్లి                      కోరుకంటి చందర్​

 

(ఫార్వర్డ్​ బ్లాక్​)

  • మిగతా జిల్లాలకు అధ్యక్షులు
  • జిల్లా    అధ్యక్షుడి పేరు (పదవి)
  • సిద్దిపేట    కొత్త ప్రభాకర్​ రెడ్డి (ఎంపీ)
  • మహబూబాబాద్​    మాలోత్​ కవిత (ఎంపీ)
  • సూర్యాపేట    బడుగుల లింగయ్య యాదవ్​ (ఎంపీ)
  • ఖమ్మం    తాతా మధుసూదన్​ (ఎమ్మెల్సీ)
  • మేడ్చల్​    శంభీపూర్​రాజు (ఎమ్మెల్సీ)
  • జనగామ    సంపత్​రెడ్డి (జెడ్పీ చైర్​పర్సన్​)
  • జయశంకర్​ భూపాలపల్లి    గండ్ర జ్యోతి (జెడ్పీ చైర్​పర్సన్​)
  • ములుగు    కుసుమ జగదీశ్​ (జెడ్పీ చైర్​పర్సన్​)
  • యాదాద్రి భువనగిరి    కంచర్ల రామకృష్ణారెడ్డి (ఆయిల్​ఫెడ్ ​చైర్మన్​)
  • వనపర్తి    ఏర్పుల గట్టుయాదవ్​ (మున్సిపల్​ చైర్మన్​)
  • కరీంనగర్​    జీవీ రామకృష్ణారావు (సుడా చైర్మన్​)
  • సంగారెడ్డి    చింతా ప్రభాకర్​ (మాజీ ఎమ్మెల్యే)
  • కామారెడ్డి    ఎస్కే ముజీబుద్దీన్​ (డీసీఎంస్​ మాజీ చైర్మన్​)
  • రాజన్న సిరిసిల్ల    తోట ఆగయ్య (మాజీ ఎంపీపీ)