మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహం

మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహం

మునుగోడు బైపోల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు ఇప్పటికే నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలీ ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా మందుకు సాగుతోంది. పద్మశాలీల ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. నేతన్న బీమా పథకాన్ని చేనేత, పవర్ లూమ్ కార్మికులకు వర్తింపజేయాలని నిర్ణయించింది. నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో వారిని సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చేనేత కార్మికులు పమాదంలో చనిపోతే వారి కుటుంబాలకి నేతన్న పథకంతో ఆర్థికసాయం అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఎల్ఐసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం అమలకు హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించింది. చేనేత, జౌళీశాఖ ఏజెన్సీగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 80వేల మంది నేత కార్మికులకు మేలు జరగనుంది. 

మునుగోడు నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాల పరిధిలో 12 వేల మంది సభ్యులున్నారు. సీఎం కేసీఆర్ నేతన్న బీమా పథకాన్ని గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించారు. ఇంతకాలం అమలు కాలేదు. మునుగోడు ఉప ఎన్నికతో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని గత నెల ఆగస్టు 7న ప్రారంభించారు. ఈ స్కీమ్ ను టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తోంది. మునుగోడు నియోజకవర్గం పరిధిలో బీసీ కులాల్లో ఎక్కువగా గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. గౌడలు 35వేల మంది వరకు ఉండగా, ముదిరాజ్ లు 33వేలు, యాదవులు 21వేలు, పద్మశాలీలు సుమారు 12 వేల మందిఉన్నారు. చేనేత బీమా పథకంతో సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.