దళిత బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్ లీడర్లను గ్రామంలోకి రానియ్యం : మహిళలు

దళిత బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్ లీడర్లను గ్రామంలోకి రానియ్యం : మహిళలు

దళిత బంధు ఇవ్వకుంటే ఎమ్మెల్యేను గ్రామంలోకి రానివ్వమని మహిళలు హెచ్చరించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా నెల్లికదురు గ్రామపంచాయతీ ముందు దళిత మహిళలు అందోళన చేపట్టారు. అర్హులైన దళితులుకు దళిత బంధు ఇవ్వాలంటూ మహిళలు ధర్నా చేశారు. టీఆర్ఎస్ లీడర్లకే దళిత బంధు ఇస్తారా అని ప్రశ్నించారు. 

కూలి పనులు చేసుకునేటోళ్లకు దళిత బంధు ఇవ్వరా అంటూ దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వకపోతే టీఆర్ఎస్ లీడర్లను, ప్రజా ప్రతినిధులును గ్రామంలో తిరగనివ్వమని దళిత మహిళలు డిమాండ్ చేశారు.