దళితులకు మూడెకరాలివ్వాలని రాజ్యాంగంలో ఉందా?

దళితులకు మూడెకరాలివ్వాలని రాజ్యాంగంలో ఉందా?

దళిత సీఎం చేస్తామని, మూడెకరాల భూమి ఇవ్వాలని రాజ్యాంగంలో వుందా అని ప్రశ్నించారు TRS ప్రభుత్వ విప్ , MLA గువ్వల బాలరాజు. సభలు వేరు.... రాజ్యాంగం వేరు.. మేనిఫెస్టో వేరని చెప్పారు. BJP , కాంగ్రెస్ నేతల చేతుల్లో భూమి ఉంది అందుకే.. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయామన్నారు. ఆక్రమణదారులు భూమి ఇస్తే దళితులకు పంచుతామన్నారు. కేసీఆర్ చెప్పినట్లు కొత్త రాజ్యాంగం అవసరమా లేదా.. పార్లమెంట్ లో చర్చ జరపాలన్నారు. కొత్త రాజ్యాంగం అవసరమా లేక కేసీఆర్ ను దోషిగా నిలబెడతారా తేల్చండన్నారు. రాజ్యాంగం మారాలా లేక పాలకులు మారాలా అనేది తేల్చండన్నారు. 

సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం అవసరం అనే వ్యాఖ్యలకు మద్దతిస్తున్నామన్నారు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అంబేడ్కర్ స్ఫూర్తితో కొత్త రాజ్యాంగం తెస్తామన్నారు. ఎన్నికల ముందు జైభీమ్... ఎన్నికల తర్వాత నై భీమ్ బీజేపీ స్టైల్ అని విమర్శించారు.