ఎంపీ నామా కంపెనీ డైరెక్టర్లను విచారిస్తున్న ఈడీ

ఎంపీ నామా కంపెనీ డైరెక్టర్లను విచారిస్తున్న ఈడీ

కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విదేశాలకు మళ్లించారనే ఆరోపణలతో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు ఇళ్లు, కంపెనీల మీద రెండు వారాల క్రితం ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలో కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. అనంతరం నామాకు మరియు ఆయన కంపెనీల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా.. శుక్రవారం నామాకు చెందిన రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ కంపెనీ  డైరెక్టర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. రాంచీ కంపెనీకి శ్రీనివాస్ రావు, సీతయ్య, పృథ్వీతేజ డైరెక్టర్లుగా ఉన్నారు.  బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇతర కంపెనీలకు మళ్లించిన 264 కోట్ల రూపాయల నిధులపై  ఈడీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ముగ్గురు డైరెక్టర్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.