టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్సీ జాబితా ఖరారు అయ్యింది. ఇప్పటికే ఆరుగురు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఉత్తర తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆరుగురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది.  తుక్కెళ్ల  పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, , పాడి కౌశిక్ రెడ్డి పేర్లను ప్రకటించారు. వీరంతా ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు వచ్చింది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వీరిలో శాసనమండలి మాజీ ఛైర్మన్‌కు మరోసారి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినట్లు ఉంది. ఖరారైన వారిలో బండ ప్రకాశ్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనను ఎమ్మెల్సీగా ఖరారు చేయడంతో .. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సిటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీగా నిర్ణయించారు. నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన జరగనుంది.నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్ 10 పోలింగ్. డిసెంబర్ 14 కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.