True Lover OTT Official: OTTకి వచ్చేసిన ఎమోషనల్ మూవీ ట్రూ లవర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

True Lover OTT Official: OTTకి వచ్చేసిన ఎమోషనల్ మూవీ ట్రూ లవర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జై భీమ్, గుడ్ నైట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మణికందన్(Manikandan). ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ  లవర్(Lover). ఈ సినిమాలో తెలుగు నటి శ్రీగౌరి ప్రియ(SriGouri Proya) హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యూత్, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన లవర్ మూవీ మళయాళ బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది.

ALSO READ | Siddarth, Aditirao Hyderi: సీక్రెట్గా పెళ్లిచేసుకున్న సిద్దార్థ్, అదితిరావు హైదరీ

ఇక మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచినా లవర్ సినిమాను ట్రూ లవర్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి టాక్ వచ్చింది. అయితే.. టాక్ బానే వచ్చినప్పటికి కలెక్షన్స్ మాత్రం ఆంతగా రాబట్టలేకపోయింది ఈ సినిమా. దాంతో తెలుగులో యావరేజ్ టాక్, కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది ట్రూ లవర్ మూవీ. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌ మార్చ్ 27 నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తెలుగుతో పాటు.. తమిళ, మళయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది ఈ సినిమా. మరి థియేటర్స్ లో యావరేజ్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.