US-China Deal: చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్.. 8 గంటల చర్చల్లో ఏం జరిగింది..?

US-China Deal: చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్.. 8 గంటల చర్చల్లో ఏం జరిగింది..?

US-China Trade Deal: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలుగా ఉన్న చైనా-అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మెుత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. ఇరు దేశాల ప్రతినిధిలు స్విడ్జర్లాండ్ లోని జెనీవాలో రెండు రోజులుగా జరుపుతున్న సుదీర్ఘ చర్చలు ఫలవంతంగా ముగిశాయని ఆ దేశాలు ప్రకటించాయి.

అమెరికా చైనాపై భారీగా సుంకాలను గతనెలలో ప్రకటించిన తర్వాత అధికారికంగా జరిగిన వాణిజ్య చర్చలు అయినప్పటికీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టలేదు. వాస్తవానికి అమెరికా చైనా దిగుమతులపై 145 శాతం పన్ను ప్రకటించగా, ఏమాత్రం తగ్గని చైనా అదే స్థాయిలో కొన్ని అమెరికా వస్తువులపై 125 శాతం వరకు పన్నులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను కూడా వాస్తవానికి ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. 

అమెరికా చర్యలు ఆర్థిక వ్యవస్థల్లో ఆందోళనలను సృష్టించటంతో పాటు ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారే ప్రమాదంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా చైనాతో తన వాణిజ్య లోటును 1.2 ట్రిలియన్ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలతో నేడు చైనా, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు పుంజుకోగా.. సాయంత్రం తెరచుకునే అమెరికా మార్కెట్లు కూడా స్వాగతిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

►ALSO READ | ఇన్వెస్టర్లకు కీలక సీక్రెట్ చెప్పిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈవో.. ఇలా చేస్తే లాభాలే..!!

చైనాతో ట్రేడ్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. జెనీవాలో జరిగిన చర్చలు మంచివిగా అభివర్ణించారు. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో జరిగిన చర్చలు మంచి పురోగతి సాధించగలిగినట్లు పేర్కొన్నారు. దీనివల్ల అమెరికా, చైనాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చల్లో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్, చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ పాల్గొన్నారు. అయితే మెుత్తానికి చైనాపై సుంకాలను 80 శాతానికి పరిమితం చేయవచ్చని తెలుస్తోంది.  కొందరు నిపుణులు మాత్రం దీనిని మరింతగా తగ్గించేందుకు అమెరికా ఆలోచించవచ్చని అంటున్నారు.