జో బిడెన్ గెలిచేందుకు చైనా కుట్ర చేస్తోంది

జో బిడెన్  గెలిచేందుకు చైనా కుట్ర చేస్తోంది
  • అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ఆరోపణలు

వాషింగ్టన్ : చైనా పై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తి కి ఆ దేశమే కారణమంటూ ఇన్నాళ్లు చేస్తోన్న ఆరోపణల డోస్ పెంచారు. తన ప్రత్యర్థి జో బిడెన్ ను అమెరికా ప్రెసిడెంట్ చేసేందుకు చైనా కుట్ర చేస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు చైనా పై ఎన్ని విమర్శలు చేసిన ఓ లిమిట్ లోనే ఉండేది. కానీ ట్రంప్ తాజాగా చేసిన విమర్శలు రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచేలా ఉన్నాయి. ఇదంతా పై నుంచి వస్తుందంటూ ఇన్ డైరెక్ట్ గా చైనాను పై కామెంట్లు చేశారు. అమెరికా, యూరోప్ లపై చైనా చేస్తున్న ప్రచారం అవమానకరంగా ఉందన్నారు. తరచూ కరోనా వ్యాప్తికి చైనాయే కారణమంటూ ట్రంప్ ఆరోపిస్తుండగా అందుకు డ్రాగన్ కౌంటర్ ఇస్తోంది. కరోనా నివారణలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యిందని దాన్ని కవర్ చేసుకునేందుకే మా పై ఆరోపణలు చేస్తున్నారంటూ చైనా కౌంటర్ ఆటాక్ చేస్తోంది. పలుమార్లు ట్రంప్ ను చైనా విమర్శిస్తుండటంతో తాజాగా తన ఓటమికి ఆ దేశం కుట్ర చేస్తోందని ట్రంప్ చెప్పారు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బిడెన్ గెలిచేందుకు తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వరుస ట్వీట్లు చేశారు. తాను రాకముందు వరకు జరిగిన దోపిడీని మళ్లీ కొనసాగించేందుకు జో బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటదని అన్నారు.