- క్యూబా, కొలంబియాకు,
- మెక్సికోకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: వెనెజువెలా ప్రెసిడెంట్ మదురోను అమెరికా బంధించిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ల్యాటిన్ అమెరికాలోని క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలను కూడా ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశాలు పద్ధతి మార్చుకుని, డ్రగ్స్ ముఠాలకు ఆశ్రయం ఇవ్వడం మానుకోవాలన్నారు. అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టకపోతే ఆ దేశాలకు కూడా వెనెజువెలా పరిస్థితే వస్తుందన్నారు. ఆయా దేశాల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై దాడులకు
కూడా వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.
