ఫస్ట్ టైమ్ యోగా చేస్తున్నారా?.. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయకండి

ఫస్ట్ టైమ్ యోగా చేస్తున్నారా?.. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయకండి

ఫిట్‌‌గా ఉండటం కోసం యోగా చేయాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆగండి. ఎందుకు ఆగమటున్నామని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. యోగా అంత సులువు కాదు. ముఖ్యంగా బిగినర్స్‌‌కు యోగా ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నది. తొలిసారి యోగా చేస్తున్న వాళ్లు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. యోగా చేసే విధానం, కదలికలు, భంగిమ, పట్టు, టైమింగ్ అన్నీ ముఖ్యమే.

యోగాలో ఎంత పరిశ్రమిస్తే ఫలితాలు అంత త్వరగా వస్తాయి. కొత్తగా యోగా చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. యోగాలో గ్రాండ్ మాస్టర్ అయిన అక్షర్ ప్రకారం.. బిగినర్స్ యోగాను మెళ్లిగా సాధన చేయాలి. ఆ తర్వాత మెళ్లిమెళ్లిగా వేగాన్ని పెంచొచ్చు. ప్రాక్టీస్ మీద ఎప్పుడూ ఫోకస్‌తో ఉండాలి. ఇందుకు క్రమశిక్షణ చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. సూక్ష్మ వ్యాయామంతో సాధన ఆరంభించాలని మెడ, చేతులు, హిప్స్, యాంకిల్స్ లాంటి జాయింట్లను వార్మప్ చేయాలి. ఇలా చేయడం ద్వారా గాయాల పాలవ్వకుండా బయటపడొచ్చన్నారు. వీటితో పాటు 7 ఆసనాలను బిగినర్స్ చేయొద్దన్నారు.

1. పద్మాసనం: పద్మాసనం చేయడం వల్ల మోకాలు, చీలమండ మీద అధిక ఒత్తిడి పడుతుంది. కొత్తగా యోగా చేసే వారికి ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం మంచిది కాదు. పద్మాసనం చేయడానికి ముందు హిప్స్‌‌కు సంబంధించిన వార్మప్‌‌లు చేయడం చేయాలి.

2. సుప్త వజ్రాసనం: బ్యాక్ పెయిన్ ఉన్న వారు ఈ ఆసనం చేయాలి. మోకాలు, చీలమండ జాయింట్లలో ఇబ్బందులు ఉన్న వారు కూడా చేయొచ్చు. అదే టైమ్‌‌లో బిగినర్స్ ఈ ఆసనాన్ని చేయొద్దు. వజ్రాసనంతో ప్రాక్టీస్‌‌ను స్టార్ట్ చేయొచ్చు.

3. చతురంగాసనం: ఈ ఆసనం వేయడానికి శరీర పైభాగంలో చాలా బలం ఉండాలి. చేతులు, భుజాలు, మోచేతుల్లో స్ట్రెంగ్త్ ఉండాలి. బిగినర్స్ సంతోలనాసనతో ప్రారంభించొచ్చు. దీని వల్ల అప్పర్ బాడీ బలంగా అవుతుంది. చతురంగ దండాసనంకు ముందు ఈ ఆసనం వేయడం ప్రిపరేషన్‌‌గా పనికొస్తుంది.

4. పశ్చిమోత్తనాసనం: ఈ ఆసనం కొత్త సులువగా కనిపిస్తుంది. కానీ తొడ కండరాలు పట్టేసి ఉన్నా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా దండాసనతో స్టార్ట్ చేస్తే మంచిది. తొడ కండరాలు, నడుము కింది భాగాన్ని బలంగా తయారు చేసేందుకు దండాసన బాగా పనికొస్తుంది.

5. చక్రాసనం: వెనక్కి మళ్లీ చేసే చక్రాసనం అంత సులువు కాదు. బిగినర్స్ ఈ పోజ్‌‌కు బదులు బేసిక్ వేరియేషన్ అయిన బ్రిడ్జ్ పోజ్ యత్నించొచ్చు. సేతు బంధ సర్వాంగాసనంతో నడుము భాగంతోపాటు శరీర కింది భాగం బలంగా తయారవుతుంది.

6. సర్వాంగాసనం: ఈ ఆసనంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ యోగాలో కొంత అనుభవం వచ్చాకే ఈ ఆసనాన్ని వేయాలి. ఈ ఆసనం వేసినప్పుడు మెడతోపాటు భుజాల మీద తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. ఈ ఆసనాన్ని వేసే ముందు హలాసనతో ప్రారంభిస్తే బాగుంటుంది.

7. శీర్షాసనం: ఈ ఆసనం కూడా చాలా అడ్వాన్స్‌‌డ్ పోజ్. ఈ ఆసనం వేసే సమయంలో శరీరం మీద చాలా ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా తల మీద ప్రెజర్ పడుతుంది. అందుకే స్ట్రెంగ్త్ వచ్చే వరకు ఈ ఆసనం చేయొద్దు. అందుకోసం హలాసనం ప్రాక్టీస్ చేయాలి.