టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు

టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు

టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించింది. టెట్ తో సంబంధం లేకుండా టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గెజిట్ విడుదల చేసింది. 

అయితే పదవీ విరమణకు మూడేండ్ల లోపు ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయింపును ఇచ్చింది. మల్టీ జోన్-1లో ఉన్నవారికి జూన్ 8  నుంచి 22వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించింది. మల్టీజోన్-2లో ఉన్నవారికి 30వ తేదీ వరకు పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించింది. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.