సిట్కు TSPSC పేపర్ లీక్ కేసు

సిట్కు TSPSC పేపర్ లీక్ కేసు

AE పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు  ఈ  కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  పోలీసులు  8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు,  మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.