రాజీవ్​ స్వగృహ ఆస్తులన్నీ అర్రాస్​!

రాజీవ్​ స్వగృహ ఆస్తులన్నీ అర్రాస్​!
  • రూ.5,325 కోట్లు రాబట్టాలని సర్కార్​ నిర్ణయం
  • సీఎం పర్మిషన్ రాగానే సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా అమ్మేయాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా రూ.5,325 కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. మొన్నటి దాకా ప్లాట్లు, ఫ్లాట్లు మాత్రమే అమ్మాలని ప్రపోజల్స్ రెడీ చేయగా, తాజాగా భూములనూ ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిపారు. హైదరాబాద్, సిటీ శివారు ప్రాంతాలతోపాటు జిల్లాల్లో రాజీవ్ స్వగృహ కింద ఫ్లాట్లు, ఇండ్లు, ల్యాండ్స్ అన్నీ కలిపి 1,575 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. టౌన్ షిప్స్ పేరుతో కట్టిన అపార్ట్​మెంట్లు, ఇతర ప్రాజెక్టుల్లో కట్టిన ఇండ్లతోపాటు ఓపెన్ ప్లాట్లను, భూములకు ఎక్కడ ఎంత మార్కెట్ రేట్ ఉందనే దానిపై ఇప్పటికే లెక్కలు కట్టారు. సీఎం పర్మిషన్ రాగానే సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటిఫికేషన్ ఇస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు.
మొత్తం గంపగుత్తగా అమ్మేలా..
స్క్వేర్ ఫీటుకు ఇంత అని రేట్ ఫిక్స్ చేసి అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, ప్లాట్లు అమ్మనున్నారు. తర్వాత భూములను ఎకరా చొప్పున లేదా చదరపు గజాల లెక్కన వేలం వేస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, ఇండ్లు, ల్యాండ్స్ అన్నీ కలిపి మొత్తం 1,575 ఎకరాలను అమ్మితే ఎంతొస్తుందో తెలుసుకునేందుకు నైట్​ఫ్రాంక్​ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి రిపోర్టు తయారు చేశారు. అయితే గంపగుత్తగా అమ్మేందుకు వీలుగా వీటిని ఇండివీజ్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యక్తులకు కాకుండా ప్రైవేట్ కంపెనీలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అమ్మకానికి పెడుతున్న ఈ భూముల్లో లక్షల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వొచ్చని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు అంటున్నారు. కాదని అమ్మకానికి పెడితే.. సామాన్యులు కూడా కొనుక్కునేలా వెసులుబాటన్నా కల్పించాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టూ లిటిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 150 ఎకరాలు
హైదరాబాద్ చుట్టుపక్కల 150 ఎకరాల రాజీవ్ స్వగృహ ల్యాండ్స్ లిటిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. వీటి మార్కెట్ వాల్యూ రూ.737 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేశారు. బాచుపల్లిలో 25 ఎకరాలు, బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 83, బోడుప్పల్​మున్సిపాలిటీ పరిధిలో 20, పేట్​బషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18, నిజాంపేటలో 3 ఎకరాలు లిటిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వీటిని లోకల్ లీడర్లు, అధికార పార్టీ పెద్దల అండతో కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
మొత్తం ఫ్లాట్లు 9,678.. అమ్మింది 680
నాగోల్ బండ్లగూడ, పోచారం, జవహర్​నగర్, గాజుల రామారంతోపాటు ఖమ్మం జిల్లా పోలేపల్లిలో 9,678 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 1,747 మాత్రమే పూర్తిగా కట్టారు. వాటిలో 680 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. 5,961 సెమీ ఫినిష్డ్, 1,290 అన్ ఫినిష్డ్ ఫ్లాట్లున్నాయి. పని పూర్తయిన వాటికి ఒక రేటు, కాని వాటికి మరో రేటు ఫిక్స్ చేస్తారని సమాచారం. వీటిపై​రూ.1,831 కోట్లు వస్తుందని అంచనా. అమ్మినవి పోను మిగిలిన ఫ్లాట్లను సామాన్యులకు కేటాయించాలనే డిమాండ్​ఎప్పట్నుంచో ఉంది. అయితే అలాకాకుండా ప్రైవేట్​కంపెనీలకు అప్పగించాలని సర్కారు ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని ప్రభుత్వోద్యోగులకు కేటాయించాలని గతంలో అనుకున్నారు.
ఇండివీజ్యువల్ ఇండ్లతో రూ.343 కోట్లు
రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ భూముల్లో లేఔట్లు డెవలప్​చేశారు. వీటిలో కొన్ని ఓపెన్ ప్లాట్లు కాగా మరికొన్ని ఇండ్లు నిర్మించారు. ఇవి హైదరాబాద్​చుట్టుపక్కల పది చోట్ల 453.55 ఎకరాల్లో ఉన్నాయి. 1,163 ఇండ్లు కట్టియ్యగా వాటిలో 525 అమ్మేశారు. మిగిలిన 638 ఇండ్ల విస్తీర్ణం 4.84 లక్షల స్క్వేర్ ​ఫీట్లు. 2,907 ఓపెన్ ప్లాట్లలో 806 అమ్మారు. మిగిలిన 2,101 ప్లాట్లను అమ్మకానికి పెడుతున్నారు. వీటి విస్తీర్ణం 3.95 లక్షల స్క్వేర్ యార్డులని తేల్చారు. వీటి అమ్మకం ద్వారా రూ.343 కోట్లు వస్తుందని అంచనా.