పరీక్షలపై ఇంటర్ బోర్డు ఫోకస్

V6 Velugu Posted on Jan 29, 2020

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకుంటోంది ఇంటర్ బోర్డు. గతేడాది తలెత్తిన సమస్యలు రిపీట్ కాకుండా చర్యలు చేపడుతోంది. ప్రతీ కాలేజ్ నుంచి సీనియర్ లెక్చరర్లు మాత్రమే వాల్యూయేషన్ లో పాల్గొనాలని, లేదంటే ఆ కాలేజీ  గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. గతేడాది 1183 మంది లెక్చరర్లు వాల్యూయేషన్ లో  తప్పులు చేసినట్లు గుర్తించారు. వారికి  5 వేల రూపాయల జరిమానా విధించగా 483 మంది మాత్రమే చెల్లించారని, మిగతా వారికి నోటీసులు ఇచ్చామన్నారు ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఒమర్ జలీల్. ఈ సారి కూడా వాల్యూయేషన్ తో తప్పులు వస్తే భారీ జరిమానా విధించాలని నిర్ణయించామన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 2 లక్షల 47 వేల 915 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారి కోసం 1516 ప్రాక్టికల్స్ సెంటర్స్ ,1339 థియరీ సెంటర్స్, 416 ఓకేషనల్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు కమిషనర్.  ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో తప్పులు వస్తే సరి చేసుకునే అవకాశం కల్పించింది బోర్డు.

అంధ విద్యార్థులకు ల్యాప్ టాప్ తో పరీక్ష రాసే సౌకర్యం, అదనంగా గంట టైమ్ కేటాయించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. మరో 2 రోజుల్లో ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానల్ ను కూడా  ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎలా నిర్వహించాలనే అంశాలపై వీడియోలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు బోర్డు అధికారులు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఇంటర్ బోర్డ్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది

Tagged students, Focus, board, inter, examinations

Latest Videos

Subscribe Now

More News