టెట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్..అభ్యర్థి అరెస్ట్

టెట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్..అభ్యర్థి అరెస్ట్

టెట్ ఎగ్జామ్స్ లో మాల్ ప్రాక్టీస్ జరిగింది.  నల్లగొండ జిల్లాలోని  మిర్యాలగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టెట్ పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థికి ఇన్విజిలేటర్ సహకరించారు. 

మిర్యాల గూడ కృష్ణవేణి టాలెంట్ స్కూళ్లో టెట్ పరీక్షకు హాజరయ్యాడు ఎండీ వారిష్ ముజారి. అతను మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాడు. ఎండీ వారిష్ ముజారి మాల్ ప్రాక్టీస్ కు ఇన్విజిలెటర్ తనీష్ ఖనం సహకరించాడు.  ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు..మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఎండీ వారిష్ ముజారి, ఇన్విజిలెటర్ తనీష్ ఖనంలను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.