బీజేపీలో చేరిన టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్

బీజేపీలో చేరిన టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్

తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత., టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్ కాషాయం కండువా కప్పుకున్నారు. పలువురు నాయకులతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నక్వి  ఆధ్వర్యంలో విఠల్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి, కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి నక్వి. విఠల్ తో పాటు చందు శ్రీనివాస్ రావు, టి శ్రీనివాస్ రావు, వివేక్ కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్ కుమార్, ఎంపి అరవింద్, బిజెపి పార్లిమెంట్ పార్టీ  కార్యదర్శి కామర్సు బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారులకు బీజేపీ సరైన వేదిక అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేస్తున్నారన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. ఉద్యమకారుల్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు దానికి నాంది పలికాయన్నారు. నీళ్ళు, నిధులు, నియామాకాల  కోసము తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని  పరిపాలిస్తుందని ఆరోపించారు. విఠల్ లాంటి చాలా మంది నాయకులు టీఎర్ఎస్ మీది అసంతృప్తిగా ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు బీజేపీ వల్లనే న్యాయు జరుగుతుందన్నారు. 

మరోవైపు తరుణ్ చుగ్ మాట్లాడుతూ అనేక మంది పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. చాలా మంది ఈ పోరాటంలో చనిపోయారన్నారు. చాలా మంది ఉద్యమకారులు ఉన్నారన్నారు. కలలు కన్న బంగారు తెలంగాణ ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ లూటీ రాష్త్రంగా మార్చిందని విమర్శించారు. విఠల్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు తరుణ్ చుగ్. 
తెలంగాణలో ఒకవైపు వారసత్వ రాజకీయాల పార్టీ, మరోవైపు ప్రజాస్వామ్య పార్టీ ఉందన్నారు కేంద్ర మంత్రి నఖ్వీ. విఠల్ రాచరిక పార్టీ నుంచి ప్రజాస్వామ్య పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజున ప్రపంచంలోనే పెద్ద పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు విఠల్.  గర్ వాపస్ వచ్చినందుకు సంతొషంగా ఉందన్నారు. రాష్టంలో ఉద్యమకారులను అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

రాష్టంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయములో 1500 మంది విద్యార్ధులు బలిదానాలు ఇచ్చారన్నారు. కానీ తెలంగాణా వచ్చాకా కూడా ఉద్యగాల కోసం పిల్లలు చనిపోతున్నారని ఆరోపించారు. 50 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వ రిపోర్టు ప్రకారము లక్ష తోబై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు గ్రూప్ వన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. బిజెపితోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని విఠల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి టిఆర్ఎస్ లో జాయిన్ అయి..మంత్రి పదవులు తీసుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు విఠల్.