20 నుంచి జేఎల్ పోస్టులకు అప్లికేషన్లు

20 నుంచి జేఎల్ పోస్టులకు అప్లికేషన్లు

దరఖాస్తు తేదీల్లో మార్పులు చేసిన టీఎస్‌‌పీఎస్సీ 

తాజాగా రీ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు : జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ మార్పు లు చేసింది. 20 నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ శుక్రవారం రీ షెడ్యూల్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోట్ రిలీజ్ చేశారు. గతంలో 16 నుంచి జనవరి 6 దాకా అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. తాజాగా 20 నుంచి వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. వివరాలకు http://www.tspsc.gov.inను చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,392 జేఎల్ పోస్టులను భర్తీ చేస్తామని 9న టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్​టైం డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.