హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో విశేష కృషి చేసినందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) తమ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించింది.
ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నిర్వహించిన ‘సంకల్ప దివస్’ వేడుకల్లో భాగంగా టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

