అమెరికా తులసి…చాలా పవర్​ఫుల్​

అమెరికా తులసి…చాలా పవర్​ఫుల్​

తులసి గబ్బర్డ్​… పేరు చూడగానే ఇండియా నుంచి వెళ్లి సెటిలైన అమెరికన్​లా అనిపిస్తుంది. కానీ, ఆమె అమెరికన్. ఫ్యామిలీలో  ఎవ్వరికీ మనదేశంతో సంబంధం లేదు. అయినా సరే, అమెరికన్​ సిటిజన్​షిప్​గల ఇండియన్లందరికీ ఆమెపై ప్రత్యేక అభిమానం ఉంది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్  సభకు హవాయ్ నుంచి ఎన్నికైన తొలి మహిళగా తులసి గబ్బర్డ్ చరిత్ర సృష్టించారు. 2005లో ఇరాక్​లో అమెరికా సైన్యం తరఫున లాజిస్టికల్​ సపోర్ట్​ ఏరియాలో పనిచేశారు. డెమొక్రటిక్​ పార్టీ తులసికి టికెట్​ ఇచ్చినట్లయితే… మొట్టమొదటి మిలిటరీ మహిళగాకూడా గుర్తింపు పొందుతారు. అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్ల ప్రభావం చాలా ఉంది. కొన్నేళ్లుగా అక్కడి పాలిటిక్స్​లో యాక్టివ్​గా ఉన్నారు. లూసియానా గవర్నర్​గా బాబీ జిందాల్ (హర్యానా), సౌత్​ కరోలినా గవర్నర్​గా నిక్కీ హేలీ (సిక్కు), కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభ సభ్యుడిగా రోహిత్​ ఖన్నా (పంజాబీ హిందు), కాలిఫోర్నియా నుంచే సెనేటర్​గా కమలా హ్యారిస్‌(తమిళ–జమైకన్‌) పనిచేశారు. వీళ్లందరూ ఇండో అమెరికన్లే. కాకపోతే, వీళ్ల తల్లిదండ్రులో, తాత ముత్తాతలో ఇండియా నుంచి వలస వెళ్లారు.

తులసి గబ్బర్డ్​కి ఇండియాతో ఏ సంబంధం లేకపోయినా హిందూమతంలోకి మారడం వల్ల పేరు కూడా తులసి గా మార్చుకున్నారు. ఎప్పుడూ మెడలో తులసిమాలలు, చేతిలో భగవద్గీతతో కనిపిస్తారు.  ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ పోస్టుకు డెమొక్రటిక్ పార్టీ కేండిడేట్ కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  వచ్చే ఏడాది జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసి గబ్బర్డ్ పోటీ చేయబోతున్నారన్న వార్త  రెండేళ్లుగా బాగా వినపడుతోంది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఢీ కొట్టడానికి డెమొక్రటిక్ పార్టీ తరఫున చాలా మంది రెడీ అవుతున్నారు. వీరిలో మాజీ వైస్​ ప్రెసిడెంట్​ జో బిడెన్​ కూడా ఉన్నారు. వీళ్లతోపాటే తులసి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రైమరీలో దూసుకుపోతున్న తులసి

డెమొక్రటిక్ పార్టీ మొదటి, రెండో ప్రైమరీల తరువాత తులసి పాపులారిటీ మరింతగా పెరిగింది. గూగుల్ లో ఆమె వివరాల కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది. యుద్దం, శాంతి ప్రధాన అంశాలుగా తులసి ఎన్నికల రేసులో దూసుకుపోతున్నారు. అమెరికన్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో అమెరికన్లను సాయపడాలని తాను భావిస్తున్నట్లు ప్రైమరీల్లో జరుగుతున్న చర్చా వేదికల్లో తులసి చెబుతున్నారు.

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు 

తులసికి రాజకీయంగా కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. జమ్మూకాశ్మీర్ కు కొన్నేళ్లపాటు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370 ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన నిర్ణయానికి ఆమె మద్దతు పలికారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఒక ర్యాలీలో కొంతమంది మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టగా ఆమె వారించారు. కాశ్మీర్ లోయ నుంచి వందలాది పండిట్ల కుటుంబాలు వలస వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్, ఇండియాలో పూర్తి గా  కలిసి పోయిందని తెగేసి చెప్పారు.

అమెరికా తులసి…చాలా పవర్​ఫుల్​

తులసి గబ్బర్డ్​… పేరు చూడగానే ఇండియా నుంచి వెళ్లి సెటిలైన అమెరికన్​లా అనిపిస్తుంది. కానీ, ఆమె అమెరికన్. ఫ్యామిలీలో  ఎవ్వరికీ మనదేశంతో సంబంధం లేదు. అయినా సరే, అమెరికన్​ సిటిజన్​షిప్​గల ఇండియన్లందరికీ ఆమెపై ప్రత్యేక అభిమానం ఉంది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్  సభకు హవాయ్ నుంచి ఎన్నికైన తొలి మహిళగా తులసి గబ్బర్డ్ చరిత్ర సృష్టించారు. 2005లో ఇరాక్​లో అమెరికా సైన్యం తరఫున లాజిస్టికల్​ సపోర్ట్​ ఏరియాలో పనిచేశారు. డెమొక్రటిక్​ పార్టీ తులసికి టికెట్​ ఇచ్చినట్లయితే… మొట్టమొదటి మిలిటరీ మహిళగాకూడా గుర్తింపు పొందుతారు. అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్ల ప్రభావం చాలా ఉంది. కొన్నేళ్లుగా అక్కడి పాలిటిక్స్​లో యాక్టివ్​గా ఉన్నారు. లూసియానా గవర్నర్​గా బాబీ జిందాల్ (హర్యానా), సౌత్​ కరోలినా గవర్నర్​గా నిక్కీ హేలీ (సిక్కు), కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభ సభ్యుడిగా రోహిత్​ ఖన్నా (పంజాబీ హిందు), కాలిఫోర్నియా నుంచే సెనేటర్​గా కమలా హ్యారిస్‌(తమిళ–జమైకన్‌) పనిచేశారు. వీళ్లందరూ ఇండో అమెరికన్లే. కాకపోతే, వీళ్ల తల్లిదండ్రులో, తాత ముత్తాతలో ఇండియా నుంచి వలస వెళ్లారు. తులసి గబ్బర్డ్​కి ఇండియాతో ఏ సంబంధం లేకపోయినా హిందూమతంలోకి మారడం వల్ల పేరు కూడా తులసి గా మార్చుకున్నారు. ఎప్పుడూ మెడలో తులసిమాలలు, చేతిలో భగవద్గీతతో కనిపిస్తారు.  ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ పోస్టుకు డెమొక్రటిక్ పార్టీ కేండిడేట్ కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  వచ్చే ఏడాది జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసి గబ్బర్డ్ పోటీ చేయబోతున్నారన్న వార్త  రెండేళ్లుగా బాగా వినపడుతోంది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఢీ కొట్టడానికి డెమొక్రటిక్ పార్టీ తరఫున చాలా మంది రెడీ అవుతున్నారు. వీరిలో మాజీ వైస్​ ప్రెసిడెంట్​ జో బిడెన్​ కూడా ఉన్నారు. వీళ్లతోపాటే తులసి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.