
72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. రీసెంట్ గా మమ్ముట్టి నటించిన టర్బో మూవీ మే23న థియేటర్లో రిలీజై మంచి కలెక్షన్స్ రాబట్టింది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
టర్బో ఓటీటీ
ప్రస్తుతం మమ్ముట్టి సినిమాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో..టర్బో ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ మేరకు టర్బో మూవీ ఆగస్టు 9న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ సినిమా కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే థియేటర్లోకి అందుబాటులోకి రాగా..ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అందుబాటులోకి రానుంది.
Get ready for a thrilling action blockbuster!
— Sony LIV (@SonyLIV) July 10, 2024
Turbo streaming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV#Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth #TruthGlobalFilms #WayfarerFilms pic.twitter.com/Fkn9X1qjPy
టర్బో బాక్సాఫీస్
ఈ సినిమా కేవలం తమిళ థియేటర్లలో రిలీజైన కూడా కేరళ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ రూ.10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు టర్బో మూవీకి 6.25 కోట్ల కలెక్షన్స్ రాగా..రెండో రోజు రూ.3.75 కోట్ల వసూళ్లను మాత్రమే ఈ మూవీ రాబట్టింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకు సుమారు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ దాదాపు రూ.23 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా యాక్షన్ మూవీలో ప్రతి ఎలిమెంట్ అన్నిరకాల ఆడియాన్స్ కు తెగ నచ్చేసింది.
The Unstoppable Force marches on! ????
— MammoottyKampany (@MKampanyOffl) June 3, 2024
Ecstatic as we breach the ₹70 crore mark worldwide. Thanks to everyone involved in making our movie a success as historic as this.#Mammootty #MammoottyKampany #TurboMovie #WayfarerFilms #TruthGlobalFilms #SamadTruth @mammukka pic.twitter.com/MJlmhsSdPK
గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం కన్నూర్ స్క్వాడ్ (Kannur Squad).కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ..వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేరళ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది.అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా..ఇకపోతే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.ప్రస్తుతం మమ్ముట్టి బజూక సినిమాలో నటిస్తున్నాడు.