మీ భార్య ఎక్కడ .. ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న

మీ భార్య ఎక్కడ ..  ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. అమెరికా పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్‌తో మస్క్  భేటీ అయ్యారు.   ఈ కార్యక్రమానికి మస్క్‌ తన కుమారుడినీ తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా మస్క్  యోగక్షేమాలు ఆరా తీసిన ఎర్డోగాన్‌.. మీ సతీమణి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఊహించిన ప్రశ్న ఎదురుకావడంతో  ఆమె ప్రస్తుతం శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్నట్లుగా తెలిపారు.

Also Raed :- ఈ రెండు రంగాల్లో.. AI వల్ల ఉద్యోగాలు పోతాయా..

ప్రస్తుతం తామిద్దరం విడిపోయామని, కుమారుడి సంరక్షణను తానే ఎక్కువగా చూసుకుంటున్నట్లుగా ఎర్డోగాన్‌తో  చెప్పారు.  

కెనడాకు చెందిన గాయని గ్రిమ్స్‌తో ఎలాన్‌ మస్క్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఈ ఏ-12, టెక్నో మెకానికస్‌ అనే కుమారులతోపాటు కుమార్తె ఎక్సా డార్క్‌ సిడేరియల్‌ ఉన్నారు. గత సెప్టెంబరులో గ్రిమ్స్‌, ఎలాన్‌ మస్క్‌ విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఈ పిల్లలను విడివిడిగా పెంచుకుంటున్నారు.