V6 News

బహిరంగ వేలంలో పసుపు అమ్మకాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బహిరంగ వేలంలో పసుపు అమ్మకాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని పసుపు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఓపెన్​ ఆక్షన్​ విధానంలో పసుపు అమ్మకాలు చేపట్టి లాభసాటి రేట్​పొందడానికి సహకరిస్తామన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రొగ్రాంలో భాగంగా సిరికొండ మండలం ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన మీటింగ్​లో ఉర్దూ అకాడమీ చైర్మన్ ​తాహెర్ బిన్​ హందాన్​తో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహిరంగ వేలంపాటలో క్వింటాల్​పసుపునకు రూ.16 వేల ధర లభిస్తోందని, రైతులు అపోహలకు గురికావొద్దన్నారు. అగ్రికల్చర్​ సైంటిస్టుల సూచనలు పాటిస్తూ సాగులో రాణించాలన్నారు. త్వరలో సెకండ్​ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. ​మండల స్పెషల్​ఆఫీసర్ నాగూరావు, తహసీల్దార్​రవీందర్​రావు, ఎంపీడీవో మనోహర్​తదితరులు ఉన్నారు.

ప్రజా క్షేత్రంలోనే సమస్యలు పరిష్కారం

సిరికొండ, వెలుగు: ప్రజా క్షేత్రంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం రేవంత్​ రెడ్డి గ్రహించి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తాహెర్​బిన్​ హందాన్​అన్నారు. సిరికొండలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కలెక్టర్​ఇలా త్రిపాఠితో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరాలన్నారు. గ్రామాల నుంచి వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాని అధికారులను కలెక్టర్​ఆదేశించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎర్రన్న, గంగారెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.