దానికి మన చట్టాలంటే విలువ లేదు

దానికి మన చట్టాలంటే విలువ లేదు

కర్నాటక హైకోర్టుకు 101 పేజీల రిపోర్టు సమర్పించిన కేంద్రం

బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​ సంస్థ కావాలనే మన దేశ చట్టాలను ఉల్లంఘిస్తోందని, దానికి మన చట్టాలంటే విలువ లేదని కేంద్రం మండిపడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్విట్టర్​ ఏ రకంగా పనికొస్తలేదని మండిపడింది. రాజకీయ ట్వీట్లను తొలగించాలని, వెరిఫై చేయని ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ ట్విట్టర్​ కంపెనీ కర్నాటక హైకోర్టులో పిటిషన్ వేసింది.

అలా చేయడం వాక్ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసినట్లే అవుతుందని చెప్పింది. ఇందుకు వివరణ ఇస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ 101 పేజీల రిపోర్టును కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ధృవీకరించని ఖాతాలను తీసేయాలని మాత్రమే ట్విట్టర్​ను ఆదేశించామని, రాజకీయ ట్వీట్లను తొలగించాలని చెప్పలేదని రిపోర్టులో వివరించింది. తాము నోటీసు ఇచ్చాకే పిటిషనర్  ట్విట్టర్​ ప్లాట్​ఫాంలో తనకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారని ఆరోపించింది. కాగా, ఈ నెల 8న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.